తలపతి విజయ్ నటిస్తున్న "వారిసు" మూవీ పై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. విజయ్ గత చిత్రం బీస్ట్ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా విజయ్ సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వారిసు మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని పేర్కొంటున్న మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వని విషయం అందరికి తెలిసిందే. ఐతే, వారిసు మూవీని యూకే లో రిలీజ్ చెయ్యనున్న అహింస ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రిలీజ్ డేట్ 12-01-2023 గా పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో వారిసు మూవీ రిలీజ్ డేట్ పై సందిగ్ధత నెలకొంది. మరి రానున్న రోజుల్లోనైనా మేకర్స్ నుండి వారిసు రిలీజ్ డేట్ పై అఫీషియల్ అప్డేట్ వస్తే కానీ, ఈ కన్ఫ్యూషన్ క్లియర్ అయ్యేలా లేదు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.