ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చియా, గుమ్మడి గింజలు వంటి సూపర్ సీడ్స్ ఆహారంలో భాగమవుతున్నాయని పోషకహార నిపుణులు వివరించారు. బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు చియా గింజలు మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా-3, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కండరాల బలం, మానసిక ప్రశాంతతకు గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి. వీటిలో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, విటమిన్-E అధికంగా ఉంటాయి. నిపుణుల సూచన మేరకు రెండింటినీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. చియా గింజలను నానబెట్టి, గుమ్మడి గింజలను పచ్చిగా, వేయించి తీసుకోవచ్చు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa