యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నుండి ఇటీవల విడుదలైన చిత్రం "కార్తికేయ2". ఈ సినిమాతో పాన్ ఇండియా బరిలోకి దిగిన నిఖిల్ ఘనవిజయం అందుకున్నారు. మిస్టరీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఉత్తరాదిన సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.
రీసెంట్గానే బుల్లితెరపై సందడి చేసిన కార్తికేయ 2 సినిమాకు ఎంత TRP వచ్చిందో తెలిస్తే షాక్ అయిపోతారు. జీ తెలుగు ఛానెల్ లో కార్తికేయ 2 రీసెంట్గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయ్యింది. ఐతే, ఈ సినిమా 7. 88 భారీ TRP ను తెచ్చుకుంది. ఐతే, ఇది సీతారామం (8. 73) TRP కన్నా తక్కువే.
ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్ మూవీ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ తోనే నిఖిల్ జతకడుతున్నారు. డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa