'మేజర్' పాన్ ఇండియా గ్రాండ్ సక్సెస్ తదుపరి యంగ్ హీరో అడివిశేష్ నుండి రాబోతున్న మరొక కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ "హిట్ 2". 2020లో విడుదలైన హిట్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.
టీజర్ తో చూసే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించిన హిట్ 2 మూవీ ట్రైలర్ తో నరాలు తెగిపోయే ఉత్కంఠను రేకెత్తించింది. కోడి బుర్ర.. అని ఈజీగా కొట్టి పారేసిన ఒక క్రిమినల్ క్రైమ్ స్టోరీ హీరో శేష్ కు ఎంత కఠినమైన సవాలును విసిరిందో, ఆ క్రిమినల్ విసిరిన పెను సవాలుకు శేష్ ఎలా సమాధానం చెప్పాడు.. ఆ కోడిబుర్ర క్రిమినల్ ను శేష్ పట్టుకోగలిగాడా.. అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే..రేపు థియేటర్లకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రేపే హిట్ 2 మూవీ థియేటర్లకు రాబోతుంది.
ప్రపంచవ్యాప్తంగా 950+ థియేటర్లలో విడుదల కాబోతున్న హిట్ 2 మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa