అడవిశేష్ హీరోగా రూపొందిన 'హిట్ 2' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటించారు. కాగా, ఈ చిత్రం విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మంచి ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రివ్యూలు సైతం పాజిటివ్ గా వస్తున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే కనీసం నెల రోజులైన ఎదురు చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa