నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ వివాదాన్ని రాజేసిన మెగా బ్రదర్ నాగబాబు మరోసారి బాలయ్య టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన పరోక్షంగా విమర్శిస్తూ.. బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీ ‘కథానాయకుడు’పై వ్యంగాస్త్రాలు విసిరారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్‌లో మెగా కవిత్వాన్ని వదిలారు.
‘కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని..
చుట్టనేల.. ముట కట్టనేల
నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా
విశ్వదాభి రామ వినరా మామా.. ’ అంటూ బాలకృష్ణ బయోపిక్‌పై సెటైర్‌లు విసురుతూ.. ‘కవిత్వాలు మాకూ వచ్చండోయ్’.. అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు.
ప్రస్తుతం నాగాబాబు చేసిన ఈ బయోపిక్ వ్యంగాస్త్రాలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌ని షేర్ చేసిన 18 గంటల వ్యవధిలో 1280కి పైగా షేర్లు.. 800 పైగా కామెంట్లు రావడం విశేషం. అయితే నాగబాబు కామెంట్స్‌ను మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే.. బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ కౌంటర్లు ఇస్తున్నారు.
‘కత్తి కూతలు కొన్ని..
శ్రీరెడ్డి బూతులు ఇంకొన్ని..
ఆరంజ్ తీయనేల..కొణిదెల గబ్బును కెలకనేల..
ఉరేసుకుంటా అనే క్రీమ్ బన్నులు మనకొద్దయా..
విశ్వధాభిరామ..
ఈ కులగజ్జిగాళ్లు మనకొద్దురా మామా..
(కవిత్వాలు అందరికీ వచ్చురా జబర్దస్త్ పందిబాబు) అంటూ నాగబాబుని ఓ రేంజ్‌లో ఆడకుంటున్నారు బాలయ్య అభిమానులు.
ఇక మెగా అభిమానులు మాత్రం మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ ‘ఇన్నాళ్లూ ఏవడొస్తాడా ...ఈ నా కుల గజ్జి గాళ్ళని ఎవడు ఎదురిస్తాడా అనుకున్నా......ఆ ఇంటి రక్తమే ఆరడుగుల రూపమై నాగబాబు గారిలా వస్తుంది అనుకోలేదు.. పండగ లా దిగి వచ్చారు, ప్రాణాలకి వెలుగు ఇచ్చారు రక్తాన్నే ఎరుపెక్కించారు... మా తోడుకు తోడు అయ్యారు మా నీడకు నీడయ్యారు,మా అయ్యకు(పవన్ అన్న) అండగ నిలిచారు’ అంటూ నాగబాబుని ఆకాశానికెత్తేస్తున్నారు పవన్ అభిమానులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa