ఆది సాయికుమార్, రియాసుమన్ జంటగా నటిస్తున్న చిత్రం "టాప్ గేర్". కొంతసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ ను డైరెక్టర్ మారుతిగారు విడుదల చెయ్యడం జరిగింది. టీజర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగింది. టీజర్ లో హీరో ను విలన్ బెదిరించే డైలాగులు తప్పించి మారే ఇతర పాత్ర యొక్క డైలాగులు మనకు వినిపించవు. విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.
శశికాంత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ కీరోల్ లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.