మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఎన్డీటీవీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రాంచరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. "నాన్న.. నిన్ను చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు ఈ అవార్డు సొంతం చేసుకోవడం చూస్తే గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి అవార్డులు మరిన్ని అందుకోవాలని అభిలాషిస్తున్నాము " అని పేర్కొంటూ చిరంజీవి తమ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.