బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ రన్నర్ అప్ గా ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న సయ్యద్ రియాన్ సోహెల్ నటిస్తున్న కొత్త చిత్రం "లక్కీ లక్ష్మణ్". కొంతసేపటి క్రితమే ఈ మూవీ టీజర్ విడుదలైంది.
AR అభి ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - డైరెక్షన్ చేసారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై హరిత గోగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల్లోనే విడుదల కావడానికి రెడీ అవుతుంది. త్వరలోనే అధికారిక విడుదల తేదీ రానుంది.
ఇక, టీజర్ విషయానికి వస్తే, ఇందులో ఒక సాదా సీదా మధ్యతరగతి యువకుడి పాత్రలో సోహెల్ నటించారు. ఒక మిడిల్ క్లాస్ యంగ్ మాన్ జీవితంలో అదృష్టానికి ఎదురెళ్ళినప్పుడు జరిగిన విపత్కర పరిస్థితులని సినిమాలో వినోదాత్మకంగా చూపించడం జరిగింది. మొత్తానికి టీజర్, హిలేరియస్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పోతే, ఈ సినిమాలో మోక్ష హీరోయిన్ గా నటించింది.