టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. తాజాగా రాజమౌళిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(NYFCC) ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ సభ్యులుగా ఉన్న NYFCC 1935 లో ఏర్పడింది. వీరు ఇచ్చే అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తారు. కాగా, ఈ అవార్డు రాకతో ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ మరింత దగ్గరైనట్లు తెలుస్తోంది. మన దేశం నుండి ఈ అవార్డు పొందిన ఏకైక వ్యక్తి జక్కన్నే కావడం విశేషం.