విలక్షణ నటుడు సత్యదేవ్ నుండి రాబోతున్న ఔటండౌట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "గుర్తుందా శీతాకాలం". ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యాశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగశేఖర్ డైరెక్ట్ చేసారు.
కొంతసేపటి క్రితమే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. సత్యదేవ్ ఈ సినిమాలో దేవ్ అనే ఎనర్జిటిక్ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. దేవ్ కు తారసపడిన అమ్మాయిలు, వారితో జరిగిన ప్రేమకథలు, వాటివల్ల దేవ్ లైఫ్ లో ఎదురయ్యే వింత సంఘటనలు... మొత్తంగా ఔటండౌట్ రొమాంటిక్ రోల్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది.
కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందించారు. నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వేదాక్షర ఫిలింస్ సంయుక్త బ్యానర్లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోతే, ఈ మూవీ డిసెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.