గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "వీరసింహారెడ్డి". ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
ఈరోజు మధ్యాహ్నం 02:44 నిమిషాలకు వీరసింహంరెడ్డి రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చెయ్యబోతున్నట్టు కొంతసేపటి క్రితమే మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
ఆల్రెడీ సంక్రాంతికి వీరసింహారెడ్డి విడుదల కాబోతుందని ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారన్న మాట.