నాచురల్ స్టార్ నాని సమర్పణలో, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరించారు. అడివిశేష్ , మీనాక్షి చౌదరి జంటగా నటించారు.
నిన్న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. హౌస్ ఫుల్ ధియేటర్లతో, బాక్సాఫీస్ వద్ద కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్నారు శేష్. తాజాగా ఈ సినిమా విజయం పట్ల టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు శేష్ ను అభినందించడం జరిగింది. రేపు బాలయ్య హిట్ 2 సినిమాను చూడబోతున్నారు.