తొలి సినిమా "పెళ్లి చూపులు"తో నేషనల్ అవార్డును సొంతం చేసుకుని, స్టార్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం. ఆయన డైరెక్షన్ లో రాబోతున్న సరికొత్త చిత్రం "కీడా కోలా".
తాజా సమాచారం ప్రకారం, కీడా కోలా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసేసుకుని, తాజాగా ఈ రోజు నుండి సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుందని తెలుస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
VG సైన్మా మొట్టమొదటి ప్రొడక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.