నిన్న విడుదలైన హిట్ 2 కి ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో, థియేటర్లు జనాల రద్దీతో కళకళలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరిపేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటి నుండి ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియో గార్డెన్స్ లో హిట్ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ జరగబోతున్నాయి.
శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.