హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన "మసూద" సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. అంతేకాక క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు ఇస్తున్నారు. సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, సత్యం రాజేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ సాయి కిరణ్ మాట్లాడుతూ... మసూద సినిమాకు ముందు ఏం జరిగిందన్నది ప్రీక్వెల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. దీంతో మసూద ప్రీక్వెల్ ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని ఆడియన్స్ క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు.