ప్రేక్షకాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాలయ్య "వీరసింహారెడ్డి" అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి థియేటర్లలో విడుదల కాబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది.
పోతే, సంక్రాంతికే మరొక సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి "వాల్తేరు వీరయ్య" కూడా విడుదల కాబోతుంది. ఐతే, ఇంకా ఆ మూవీ నుండి అఫీషియల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ కాలేదు.
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలను నిర్మించేది మైత్రి మూవీ మేకర్స్ సంస్థే. దీంతో ఇప్పుడు బాలయ్య వీరసింహారెడ్డి నుండి సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ ఎలా వచ్చిందో మరికొన్ని రోజుల్లో వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ కూడా అలానే సర్ప్రైజింగ్ గా వచ్చే అవకాశాలున్నాయి.
విశేషమేంటంటే, ఈ రెండు సినిమాలలో ఒకే హీరోయిన్. ఆమెనే శ్రుతిహాసన్. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న వీరసింహారెడ్డి లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.