అల్లు శిరీష్ నటించిన కొత్త చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై చాలామంచి రెస్పాన్స్ అందుకుంది. చాన్నాళ్ల బట్టి సాలిడ్ హిట్ లేని శిరీష్ ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకోవడం జరిగింది.
థియేటర్లలో సూపర్ హిట్ ఐన ఈ సినిమా డిసెంబర్ 9 నుండి ఆహా ఓటిటిలోకి స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఈ నేపథ్యంలో ఊర్వశివో రాక్షసివో మూవీ ఆహా ట్రైలర్ కట్ రిలీజయ్యింది. నేటితరం యువత వ్యవహారశైలి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ లో ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి.
పోతే, ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. సునీల్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటించారు. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.