నిన్న విడుదలైన హిట్ 2 మూవీ సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఆడియన్స్, క్రిటిక్స్ నుండి ఏకగ్రీవంగా సూపర్ హిట్ రివ్యూలు పొందిన హిట్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ లో జోరు చూపించింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా హిట్ 2 మూవీ 11. 27కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందని తెలుస్తుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో శేష్, మీనాక్షి జంటగా నటించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మించారు. ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.