దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘వారిసు’ మూవీ తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే ‘రంజితమే’ సాంగ్ రిలీజై తెలుగు, తమిళ భాషల్లో అలరించింది. ఇదే జోష్ తో ‘థీ దళపతి’ అంటూ సాగే రెండో పాటను డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.