మీనాక్షి చౌదరి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’లోహీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది. మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ యేడాది ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించింది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది. ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ.. 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.