కోలీవుడ్ స్టార్ హీరో శింబు "వారిసు" సినిమాలో పాడిన సెకండ్ సింగిల్ 'థీ తలపతి' సాంగ్ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని మరొక్కసారి ప్రేక్షకులకు గుర్తుచేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ పాటను స్వరపరచడం జరిగింది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటించిన వారిసు మూవీ తెలుగులో వారసుడు టైటిల్ తో విడుదల కాబోతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రకాష్, రాజ్, జయసుధ, శరత్ కుమార్, ప్రభు, శ్రీకాంత్, సంగీత కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా వచ్చే నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.