హిందీ సూపర్ హిట్ సినిమా 'క్వీన్' తెలుగులో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' పేరుతోనూ.. తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్' పేరుతోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటిస్తుంటే తమిళంలో చందమామ కాజల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాల టీజర్లు రిలీజ్ అయ్యాయి. రెండిటిలో తమిళ టీజర్ సూపర్ గా క్లిక్ అయింది. తెలుగు టీజర్ సోసో గా ఉందని అనిపించుకుంది.
కారణం ఒక్కటే. తమిళం టీజర్లో కాజల్ బ్రెస్ట్ ను మరో నటి ఎల్లి అవ్రామ్ అలా చిలిపిగా నొక్కడమే. ఈ సీన్ అసభ్యంగా ఉందని కొంతమంది జనాలు మొత్తుకున్నారు గానీ ఇలాంటి విమర్శలతో సంబంధం లేకుండా టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సీన్ వివాదంగా మారేసరికి దర్శకుడు రమేష్ అరవింద్ మాట్లాడుతూ "ఒరిజినల్ సినిమాలో ఉన్న సీన్ నే మేము చిత్రీకరించాము గానీ సెన్సేషన్ క్రియేట్ చెయ్యాలనే ఆలోచన మాకు లేదు" అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ తెలుగు రీమేక్ లో ఎందుకు ఆ సీన్ లేదు?
తెలుగులో కూడా అదే సీన్ ను ఉంచుదామని దర్శకుడు చెప్పినా తమన్నా మాత్రం ఒప్పుకోలేదట. సీన్ వల్గర్ గా ఉంది కాబట్టి వద్దని చెప్పిందట. దర్శకుడు ఎంత ఒప్పించేందుకు ప్రయత్నించినా తమన్నా ఒప్పుకోకపోయేసరికి ఆ సీన్ ను చిత్రీకరించకుండా వదిలేశారట. ఇప్పుడు చూస్తేనేమో తెలుగు టీజర్ కంటే తమిళ తీజర్ కు స్పందన ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా సమయం మించి పోలేదు కాబట్టి మనసు మార్చుకొని ఆ సీన్ ను పెడతారా లేదంటే ఆ సీన్ లేకుండానే సినిమాను రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa