'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన నటి హన్సిక. తన నటన , అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తమిళం, కన్నడ చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తన ప్రియుడు సోహైల్ ను హన్సిక ఈరోజు రాజకోటలో పెళ్లి చేసుకోనుంది. జైపూర్‌లోని రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఆమె వివాహానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన సెలబ్రిటీలకే కాకుండా నిరుపేద చిన్నారులకు సైతం ఆహ్వానాలు అందాయి. గ్రాండ్ వెడ్డింగ్‌కు తమను ఆహ్వానించినందుకు హన్సికకు కృతజ్ఞతలు తెలుపుతూ చిన్నారులు చేసిన వీడియో ట్రెండింగ్ అవుతోంది.