టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల్లో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ముంబై బ్యూటీ హన్సిక. ఈమధ్య కమర్షియల్ సినిమాలను తగ్గించి, లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు దృష్టి పెట్టింది.
హన్సిక డిసెంబర్ 4వ తేదీన రాజస్థాన్, జైపూర్, ముందోట కోటలో స్నేహితుడు, బిజినెస్ పార్టనర్ సోహెల్ కతూరియా తో ఏడడుగులు నడిచి అఫీషియల్ గా వివాహ జీవితాన్ని ప్రారంభించింది. ఈ మేరకు రెండ్రోజులుగా హన్సిక వెడ్డింగ్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, తాజాగా ఈ రోజు హన్సికనే తన వెడ్డింగ్ పిక్స్ ను అఫీషియల్ గా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది క్షణాల్లోనే ఈ పిక్స్ వైరల్ గా మారాయి.