కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ "సార్" అనే డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ ని పలకరించబోతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.
ఐతే రీసెంట్గానే ధనుష్ తన రెండో తెలుగు సినిమాను కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో త్రిభాషా చిత్రంగా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ LLP బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, నారాయణ్ దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ధనుష్ కు ధీటుగా నటించే పవర్ఫుల్ విలన్ రోల్ లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ను మేకర్స్ అప్రోచ్ అయ్యారని టాక్. ఈ రోల్ కు గానూ సంజయ్ భారీగానే డిమాండ్ చేసారంట. కేజీఎఫ్ 2 లో విలన్గా నటించి ఆడియన్స్ ను విశేషంగా మెప్పించిన సంజయ్ దత్ ఆ తరువాత పలు క్రేజీ ప్రాజెక్టుల్లో విలన్గా నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, అవేవీ అధికారికం కాదు. మరి, ఈ సినిమాలో సంజయ్ నటిస్తున్నాడా లేదా అన్న విషయం పై కూడా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa