ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం తారక్ ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిన తారక్, అక్కడ భార్యతో కలిసి మియామీ బీచ్ అందాలని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే, ‘భార్య ప్రణతిని తన ప్రేమ కౌగిళ్ళలో బందిస్తూ’ ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.