ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ : 18 పేజెస్ ట్రైలర్ రిలీజ్ చెయ్యనున్న సుకుమార్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 01:06 PM

నిఖిల్ సిద్దార్ధ న్యూ మూవీ "18 పేజెస్" నుండి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్ విడుదల కాబోతుంది. పంజాగుట్టలోని నెక్స్ట్ గల్లెరియ లో 18 పేజెస్ ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ గారు చీఫ్ గెస్ట్స్ గా హాజరుకాబోతున్నారు. పోతే, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రాబోతున్న విషయం తెలిసిందే.


నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. పోతే, వచ్చే శుక్రవారమే అంటే డిసెంబర్ 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa