అఖిల్ ఫస్ట్ సినిమా లాంచ్ విషయం నాగార్జున చాల జాగ్రత్తగా తీసుకున్నారు. వివి వినాయక్ కు అఖిల్ సినిమాని అప్పచెప్పి తాను రిలాక్స్ అయ్యాడు. కానీ వినాయక్ ఊహించని విధంగా ఒక డిజాస్టర్‌ని తీసిచ్చాడు. దాంతో అఖిల్ తదుపరి చిత్రం హలో విషయంలో నాగార్జున అన్నీ తానే అయ్యారు. దర్శకుడిని ఓకే చేయడం దగ్గర్నుంచి, కథ సిద్ధం చేయించడం వరకు, ప్రమోషన్స్ ప్లాన్ చేయడం వరకు అన్నిట్లో నాగార్జున తన ముద్ర వేసారు. కానీ ఎన్ని చేసినా 'హలో' రిలీజ్ టైమింగ్ తేడా వచ్చి, ఎంసిఏతో క్లాష్ రావడంతో కమర్షియల్‌గా ఫెయిలయింది. దాంతో తీవ్రంగా నిరాశ చెందిన నాగార్జున ఆ తర్వాత అఖిల్ సినిమా ఎంపికలో జోక్యం చేసుకోలేదు.
మిస్టర్ మజ్ను కథని అఖిల్ సొంతం నిర్ణయంతో ఓకే చేసుకున్నాడు. ఈ చిత్రం విడుదలకి దగ్గర పడుతున్నా కానీ నాగార్జున అయితే అసలు ఇన్‌వాల్వ్ అ హలో వడం లేదట. రషెస్ చూపించమని కానీ, ఎడిట్ అయ్యాక చూస్తానని కానీ ఇంతవరకు ఏమీ చెప్పలేదట. ఇది పూర్తిగా అఖిల్ నిర్ణయానికి, అతని జడ్జిమెంట్‌కి వదిలేసిన నాగార్జున ఫలితం కోసం ఎదురు చూస్తున్నారట. విడుదలకి ముందు సినిమా చూసి అభిప్రాయమయితే చెబుతారు కానీ ఎలాంటి కరక్షన్స్ చేయకూడదని డిసైడ్ అయ్యారట. మరి నాన్న జోక్యం లేకుండా చేసిన ఈ చిత్రం అఖిల్ ఎదురు చూస్తోన్న తొలి విజయాన్ని అందిస్తుందా లేక మరోసారి నాగార్జున హలో చెప్పాల్సి వస్తుందా?
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa