బాస్ పార్టీతో మాస్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య మేకర్స్ తాజాగా ఒక డ్యూయెట్ సాంగ్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 04: 05 నిమిషాలకు వాల్తేరు వీరయ్య నుండి 'నువ్వు శ్రీదేవైతే ..నేనే చిరంజీవి అంట' లిరికల్ వీడియో విడుదల కాబోతుంది. ఈ సాంగ్ చిరు, శ్రుతిహాసన్ల మధ్య డ్యూయెట్ సాంగ్ గా ఉండనుంది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కావడానికి ముస్తాబవుతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. బాబీ కొల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు.
![]() |
![]() |