ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం "బేబీ". రీసెంట్గా విడుదలైన బేబీ టీజర్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తో ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాస్ప్ చేసింది. ఇక, అప్పటినుండి బేబీ సినిమా అప్డేట్ల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లేటెస్ట్ గా మేకర్స్ నుండి బేబీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు బేబీ ఫస్ట్ సింగిల్ రేపు సాయంత్రం 05:04 నిమిషాలకు విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
ఈ సినిమాకు సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తుండగా, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీనివాస కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ బుగ్లాని సంగీతం అందిస్తున్నారు.