ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'యాత్ర' కోసం తరలివస్తున్న జగన్ ఫ్యామిలీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 08, 2019, 01:05 PM

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా నిర్మితమైంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.

ఈ వేడుకకి వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి .. భార్య ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టుగా సమాచారం. గతంలో వైఎస్ చేపట్టిన పాదయాత్ర .. ప్రజల మనసులకు ఆయన మరింత దగ్గరైన సంఘటనలు .. ఆనాటి రాజకీయాలపై ఆయన పాదయాత్ర చూపిన ప్రభావం ఈ బయోపిక్ లో ఆవిష్కరించనున్నారు. వైఎస్ గా మమ్ముట్టి .. విజయమ్మగా ఆశ్రిత వేముగంటి నటించిన ఈ బయోపిక్ కి అంచలంచెలుగా అంచనాలు పెరుగుతుండటం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa