ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్స్ ఆఫీస్: పడి పడి లేచే మనసు మూవీ మొత్తం కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 08, 2019, 01:21 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'పడి పడి లేచే మనసు'.  క్రిస్మస్ సీజన్ సందర్భంగా డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  విడుదలైన రోజునుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది.. క్లోజింగ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్  ప్రపంచవ్యాప్తంగా రూ. 22.5 కోట్లకు అమ్ముడయ్యాయి.  కానీ ఫైనల్ రన్ లో సినిమా 35% ఇన్వెస్ట్మెంట్ మాత్రమే రికవరీ చేయగలిగింది.  ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా నష్టాలే మిగిల్చింది.  బ్రేక్ ఈవెన్ కోసం $900k  గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉండగా  $315k గ్రాస్ తో మాత్రమే సరిపెట్టుకుంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.97 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.  దర్శకుడు హను రాఘవపూడి.. శర్వానంద్ లకు వారి కెరీర్లలో ఈ సినిమా మరో డిజాస్టర్.

ప్రపంచ వ్యాప్తంగా 'పడి పడి లేచే మనసు' ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజామ్: 2.61 cr
సీడెడ్: 0.84 cr
ఉత్తరాంధ్ర: 0.82  cr
ఈస్ట్ : 0.42 cr
వెస్ట్: 0.32 cr
కృష్ణ: 0.49 cr
గుంటూరు: 0.62 cr
నెల్లూరు: 0.31 cr

ఏపీ + తెలంగాణా: రూ. 6.43 cr  
రెస్ట్ అఫ్ ఇండియా: 0.48  cr
ఓవర్సీస్: 1.06  cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.97 cr (డిస్ట్రిబ్యూటర్ షేర్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa