పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కలయికలో తొలిసారిగా రూపొందుతున్న మూవీ "హరిహర వీరమల్లు". మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై AM రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోతే, ఈ సినిమాతోనే పవన్ పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ క్రమంలో విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో తప్పించి, ఇప్పటివరకు ఎలాంటి పోస్టర్ , గ్లిమ్స్ ... ఈ సినిమా నుండి రాలేదు. తాజా బజ్ ప్రకారం, న్యూ ఇయర్ 2023 కానుకగా డిసెంబర్ 31న HHVM మేకర్స్ స్పెషల్ గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. నిజంగా ఈ విషయం నిజమే ఐతే, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ కానుకగా డబుల్ ధమాకా అందినట్టే. ఒకటి HHVM గ్లిమ్స్ కాగా, మరొకటి పవన్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ 'ఖుషి' రీ రిలీజ్.. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి, త్వరలోనే HHVM న్యూ గ్లిమ్స్ వీడియో రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ రాబోతుందట.
![]() |
![]() |