నటసింహం నందమూరి బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం "వీరసింహారెడ్డి". ఈ సినిమాకు గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
ఇప్పటివరకు ఈ సినిమానుండి రెండు పాటలు విడుదల కాగా, రెండూ కూడా శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. పెప్పీ ట్యూన్ తో, బాలయ్య గ్రేస్ మూవ్మెంట్స్ తో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. తాజాగా వీరసింహారెడ్డి థర్డ్ సింగిల్ ను విడుదల చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు బ్లాక్ బస్టర్ థర్డ్ సింగిల్ లోడింగ్ అంటూ... మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. మరి, అతి త్వరలోనే వీరసింహారెడ్డి థర్డ్ లిరికల్ సాంగ్ ఆడియన్స్ ను అలరించబోతుందన్న మాట.