వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న సినిమా 'వారిసు'. ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, ప్రభు, సంగీత, శ్రీకాంత్, శామ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
నాలుగు వారాల క్రితం తమిళంలో విడుదలైన రంజితమే సాంగ్ 100 మిలియన్ వ్యూస్, 2+మిలియన్ లైక్స్ తో యూట్యూబ్ టాప్ మ్యూజిక్ వీడియోస్ లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో యూట్యూబులో ఒక బిగ్ మైల్ స్టోన్ ను రంజితమే సాంగ్ అందుకుందని తెలుస్తుంది.
రీసెంట్గా తెలుగులో కూడా విడుదలైంది ఈ పాట. థమన్ పెప్పీ ట్యూన్, వివేక్ లిరిక్స్, విజయ్, మానసిల గాత్రం వెరసి... రంజితమే సాంగ్ ను చార్ట్ బస్టర్ గా నిలిచేలా చేసాయి.