అల్లరి నరేష్ 59వ చిత్రంగా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఆడియన్స్ నుండి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించింది. AR మోహన్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
లేటెస్ట్ గా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం డిజిటల్ ఎంట్రీ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 23 నుండి ప్రముఖ ఓటిటి జీ 5 లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుందని సదరు సంస్థ అధికారిక ప్రకటన చేసింది.
హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటించారు.