తెలుగుజాతి ఆణిముత్యం, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ. నందమూరి తారక రామారావు గారి విగ్రహం తొలిసారిగా అమెరికాలో ఆవిష్కరించబడుతుంది.
ఉత్తర అమెరికా, సీమాంధ్ర అసోసియేషన్ నేతృత్వంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు న్యూజెర్సీ లోని ఎడిసన్ నగరంలో, నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రతిపాదించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రతిపాదన రావడం జరిగిందని తెలుస్తుంది. ఎడిసన్ నగరంలో మొదటి మేయర్ గా ఎన్నుకోబడిన, భారత సంతతికి చెందిన సాన్ జోషి మరియు న్యూజెర్సీ స్టేట్ ACN సాకేత్ చదలవాడ గారు విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడంలో భాగం అయ్యారు. ఈ ఇనీషియేటివ్ కు నాసా ఫండ్ చేస్తుంది.