మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త సినిమా 'వాల్తేరు వీరయ్య'. బాబీ కొల్లి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా, బాబీ సింహా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
నిన్ననే ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ 'శ్రీదేవి - చిరంజీవి' విడుదలైంది. ఆడియన్స్ నుండి ఈ సాంగ్ కు రాకింగ్ రెస్పాన్స్ వస్తుంది. అప్పుడే ఈ పాట 5 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి, యూట్యూబ్ #1 ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో ట్రెండ్ అవుతుంది. DSP ఫుట్ టాప్పింగ్ ట్యూన్, మరియు లిరిక్స్, జస్ప్రీత్ జాస్ గాత్రం... వెరసి ఈ పాట చార్ట్ బస్టర్ ను చేసాయి.
పోతే, ఈ సినిమా జనవరి 13న థియేటర్లకు రావడానికి రెడీ అవుతుంది.