బాహుబలి సినిమాతో తొలి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రభాస్ పేరు ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఆపై బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన రికార్డులు, ప్రభాస్ అందుకున్న అవార్డులు.. లెక్కలేనివి.
లేటెస్ట్ గా డిజిటల్ రంగంలో కూడా ప్రభాస్ రికార్డుల మోత ఆగట్లేదని తెలుస్తుంది. ఈ మేరకు రీసెంట్గా ఆహా సంస్థ విడుదల చేసిన ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబులో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆహా సంస్థలో అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ ప్రోమో తిరగరాస్తుంది. 36గంటలుగా యూట్యూబ్ #1 ట్రెండింగ్ పొజిషన్లో ట్రెండ్ అవుతూ, 1. 3 కోట్ల డిజిటల్ వ్యూస్ ను, 1. 4 మిలియన్ లైక్స్ ను రాబట్టింది. అంతేకాక #PrabhasOnAHA హ్యాష్ ట్యాగ్ తో ఒక లక్ష ట్వీట్ల వరకు ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యబడ్డాయి. ఏమైనా... డార్లింగ్ రికార్డులకు బిగ్ స్క్రీన్ , డిజిటల్ స్క్రీన్ లాంటి తేడా లేనే.. లేదని తెలుస్తుంది. పోతే, ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కి రాబోతుంది.