కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న కొత్త చిత్రం "లాఠీ". క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న పాన్ ఇండియా భాషల్లో లాఠీ విడుదల కాబోతుంది. సునయన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ. వినోద్ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'కర్తవ్యాన్నొక కవచంలా' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. పోలీస్ వృత్తి గొప్పతనం, ఆ వృత్తి నిబద్ధత నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఈ పాటను శ్రీకృష్ణ, సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్ కలిసి ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.