సాయికుమార్, తారకరత్న, ప్రిన్స్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం "S 5 నో ఎక్జిట్". భరత్ కోమలపాటి డైరెక్షన్లో హార్రర్ ఎలిమెంట్స్ తో కూడిన థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని శౌరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అరుణ్ ప్రతాప్ రెడ్డి, గౌతమ్ కొండేపూడి, దేవు శామ్యూల్, షేక్ రహీం నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ గా 'భయానికైనా మహాభయం' సాంగ్ విడుదలైంది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. పోతే, డిసెంబర్ 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.