కొంతసేపటి క్రితమే "వారసుడు" మేకర్స్ 'సోల్ ఆఫ్ వారసుడు' థర్డ్ లిరికల్ సాంగ్ కు సంబంధించిన బ్యూటిఫుల్ ప్రోమోను విడుదల చేశారు. అమ్మ నేపథ్యంలో వచ్చే ఈ పాట... గాయని చిత్ర గారి వాయిస్ లో వినడానికి ఎంతో బావుంది. థమన్ అందించిన మెలోడీ ట్యూన్ మనసుకు హత్తుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి గారు అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. పోతే, ఈ సాంగ్ యొక్క పూర్తి లిరికల్ వీడియో ఈ రోజు సాయంత్రం ఐదున్నరకు విడుదల కాబోతుంది.
తమిళంలో, వారిసు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ భాషలలో పొంగల్ 2023కానుకగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.