సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంటి జరుతాయని వింటుంటాం. అయితే ఇది బయట కూడా ఉందని చెప్పారు మరాఠీ నటి తేజస్విని. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. "2010-11 ప్రాంతంలో పుణెలో ఓ కార్పొరేటర్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉండేదాన్ని. అప్పటికి నావి 2 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒకసారి అద్దె చెల్లించడానికి అతని దగ్గరికి వెళ్తే 'అద్దె వద్దు నాతో గడుపు' అని డైరెక్ట్‌గా అనేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చి టేబుల్ మీద గ్లాస్‌లో ఉన్న నీటిని అతడి మొహం మీద కొట్టేశా. ఇలాంటి పనులు చేయడానికి ఇండస్ట్రీకి రాలేదు. అలా చేస్తే ఇలా అద్దెకి ఉండాల్సిన పనిలేదని గట్టిగా చెప్పా" అంటూ తేజస్వినీ వివరించారు.