‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈయన ప్రస్తుతం లెజండరీ దర్శకుడు శంకర్ తో ‘RC15’ చేస్తున్నాడు. ఇక శంకర్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. తాజాగా ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ అగ్రహీరో, మలయాళ స్టార్ మోహన్ లాల్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇందులో మోహన్ లాల్ సీఎం పాత్ర పోషిస్తున్నారని సమాచారం. సెకండ్ హాఫ్ లో ఈయన పాత్ర రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.