హిందీలో రానా 'హాథీ మేరే సాథీ' సినిమా చేస్తున్నాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, అడవి నేపథ్యంలో సాగుతుంది. అడవిలోని ఒక ఏనుగుకి .. కథానాయకుడికి గల అనుబంధం ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను థాయ్ లాండ్ లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించారు.
ఆ తరువాత ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలోనే రానా ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబునాయుడు పాత్రను చేసేశారు. మళ్లీ 'హాథీ మేరే సాథీ' సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ రోజున కేరళలో మొదలైంది. ఇక్కడి అడవుల్లో రానా తదితరులపై కొన్ని సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. తెలుగులో 'అరణ్య' పేరుతో .. తమిళంలో 'కాదన్' పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa