చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్న సినిమా "డీజే టిల్లు". యూత్ ఫుల్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. దీంతో డీజే టిల్లు సీక్వెల్ పై అంతటా ఆసక్తి నెలకొంది.
ఐతే, మొదటి నుండి కూడా ఈ సినిమా హీరోయిన్ విషయంలో అసంతృప్తికరమైన వార్తలే విన్పిస్తున్నాయి. రాధికగా డీజే టిల్లు తో రొమాన్స్ చేసి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన నేహశెట్టిని కాదని, మేకర్స్ శ్రీలీలను సీక్వెల్ లో హీరోయిన్ గా మొదట అనుకున్నారు. కానీ ఆ అవకాశం అనుపమ పరమేశ్వరన్ ను వరించింది. ఐతే, ఆ తరవాత అనుపమ కూడా ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలొచ్చాయి. ఆ తరవాత మడోన్నా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి.. పేర్లు వినిపించాయి కానీ... తాజాగా మేకర్స్ మల్లు బ్యూటీ అనుపమనే తిరిగి ఈ సినిమాలోకి తీసుకోవాలని ఆమెతో చర్చలు జరుపుతున్నారట. మరి, అనుపమ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందో.. లేదో చూడాలి..!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa