ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటెం సాంగ్స్ మంచి అవకాశంగా భావిస్తా: తమన్నా

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 08, 2019, 07:05 PM

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ నార్త్ అని తేడా లేకుండా గత కొంత కాలంగా అవకాశాలను బాగానే అందుకుంటోంది. కుర్ర హీరోయిన్స్ పోటీలో ఎంత రచ్చ చేసినా అమ్మడి రచ్చ ఆగడం లేదు. తనకంటూ ఒక బ్రాండ్ ఆఫర్స్ ఉన్నాయంటూ ముందుకు సాగుతోంది. రిజల్ట్ సంబంధం లేకుండా ఛాన్సెస్ కొట్టేస్తోన్న అమ్మడు అప్పుడప్పుడు ఐటెమ్ సాంగ్స్ లను కూడా ను కూడా టచ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

అల్లుడు శీను - జాగ్వార్ అలాగే జై లవ కుశ సినిమాల్లో ఐటెమ్ సాంగ్ లు చేసి తన గ్లామర్ తో స్పెషల్ గా ఆకట్టుకుంది. అసలు విషయంలోకి వస్తే బేబీ అంతగా స్పెషల్ సాంగ్స్ చేయడానికి గల కారణాన్ని చెప్పింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన F2 బ్యూటీ ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

"నా కెరీర్ ప్రారంభ రోజులలో నేను నా డ్యాన్స్ కు ప్రాముఖ్యత ఇచ్చాను. కానీ నటీమణులు వారి సొంత చిత్రాలలో వారి డ్యాన్స్ టాలెంట్ ను ప్రదర్శించడానికి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. కానీ స్పెషల్ గా ఐటెమ్ సాంగ్స్ లు మన టాలెంట్ నిరూపించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. సినిమాల్లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ పైనే దృష్టి ఉంటుంది.  అది నాకు మంచి అవకాశంగా భావిస్తాను" అని తమన్నా తన వివరణ ఇచ్చింది.

ఇలా స్పెషల్ సాంగ్స్ చేస్తే రెమ్యునరేషన్ కూడా గట్టిగా అందుతుంది అనే ఒక అడ్వాంటేజ్ ఉన్నా ఆ విషయాన్ని మాత్రం మిల్కి చెప్పలేదు. కాని జనాలకు అది అర్దమవ్వకుండా ఉంటుందా!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa