నిన్న విడుదలైన 'వారిసు' మూవీ 'సోల్ ఆఫ్ వారిసు' లిరికల్ వీడియోకు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. అమ్మ నేపథ్యంలో సాగే ఈ అందమైన పాటను గాయని చిత్రగారు ఆలపించి మరింత మధురంగా మార్చారు. థమన్ మ్యాజికల్ ట్యూన్ ని అందించారు. దీంతో ఈ పాటకు యూట్యూబులో 5 మిలియన్ కు పైగా వ్యూస్ 672కే లైక్స్ వచ్చాయి.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్, రష్మిక మండన్న జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa