మెగాస్టార్ చిరంజీవి గారి నుండి వచ్చిన రీసెంట్ హిట్ మూవీ "గాడ్ ఫాదర్". మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సునీల్, షఫీ, మురళీశర్మ, అనసూయ భరద్వాజ్, దివి కీరోల్స్ లో నటించారు. థమన్ సంగీతం అందించగా, సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
తెలుగు, తమిళ భాషలలో రీసెంట్గానే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ టాప్ టెన్ మూవీస్ లో 8వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. చూస్తుంటే, ఇప్పుడప్పుడే గాడ్ ఫాదర్ హవా డిజిటల్ లో తగ్గేటట్టు కనిపించటల్లేదు.